ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..? - గుంటూరులో వైకాపా ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు
ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా? అంటూ తెదేపా అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల పోరాటానికి తెదేపా మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
chandrababu-comments-on-ap-government-in-guntur
ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు తొలగించి....లక్షల్లో కొలువులు ఇచ్చినట్లు గొప్పులు చెప్పుకొంటోందని....తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు.గుంటూరు పార్టీ కార్యాలయంలో....చంద్రబాబుతో పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న పశుసఖి మహిళలు సమావేశం అయ్యారు.నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా...ఉద్యోగాల నుంచి తమను తప్పిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల పోరాటానికి తెలుగుదేశం మద్దతు ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.