నరేగా పనులకు కేంద్రం నిధులు విడుదల చేసినా...రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చెయ్యడం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు.బిల్లులు విడుదల కాక కొంతమంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచ్‌లు,ఎంపీటీసీలు,ఎంపీపీ,జడ్పీటీసీ సంఘం నేతలు గుంటూరులో చంద్రబాబును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.నరేగా పనుల్లో బిల్లులు పెండింగ్ అంశంపై చర్చించారు.2 వేల కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.రైతు సొంత పొలంలో మట్టి తీసుకుపోవాలన్నా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారనిరేప్పొద్దున కాపురం చేయాలన్నా జే ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుందేమోనని వ్యాఖ్యానించారు.నరేగా నిధుల మళ్లింపుపై చట్టపరంగా పోరాడుతామని చంద్రబాబు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు భోరసా ఇచ్చారు.
'కేంద్రం ఇచ్చిన నరేగా నిధులను రాష్ట్రం పక్కనపెట్టింది' - chandrababu latest news
సరేగా పనులకు కేంద్రం నిధులు విడుదల చేసినా... రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ సంఘం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి పనికీ జే ట్యాక్స్ విధిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
babu