రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, గనుల శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో కొనసాగుతున్న వరద పరిస్థితుల కారణంగా తవ్వకాలకు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 97 రీచ్ల ద్వారా పరిమితంగా జరుపుతున్న తవ్వకాలతో రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేయగలుగుతున్నట్టు వివరించారు. తక్షణం ఇసుక కొరతను తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రిజర్వాయర్లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వి... సరఫరా చేయాలని సూచించారు. ప్రైవేటు పట్టా భూముల్లోనూ తవ్వకాలను పెంచాల్సిందిగా సూచించారు. ఇసుక సరఫరా కోసం అనుసరిస్తున్న విధానంలోనూ స్వల్ప మార్పులు చేయటంతో పాటు.. జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సామాన్యులకు ఇసుక లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక సరఫరాకు జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలి: జగన్ - jagan govt on sand news
రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.