డాక్యుమెంటరీ విడుదల.. పుస్తకావిష్కరణ
డాక్యుమెంటరీ విడుదల.. పుస్తకావిష్కరణ
కొండవీడు కోట దిగువన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడి చరిత్రపై డాక్యుమెంటరీని విడుదల చేశారు. కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు వైభవం పుస్తకాలను ఆవిష్కరించారు. కొండవీడుకు ఎంతో చరిత్ర ఉందని... ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. చాలామంది పేరున్న రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలిపారు. 34 కోట్లతో తిరుపతి కొండపై కంటే తక్కువ వ్యవధిలో ఘాట్ రోడ్డు నిర్మించారని వెల్లడించారు. రైతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 62 ప్రాజెక్టులు ప్రారంభించి 19 పూర్తి చేశామన్నారు. మిగతా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు.
అభివృద్ధికి తెరాస అడ్డు: సీఎం
నవ్యాంధ్ర అభివృద్ధికి తెలంగాణ అధికార పార్టీ తెరాస అడ్డుపడుతోందన్నారు. వైకాపాకు.. తెరాస పరోక్షంగా మద్దతిస్తోందని ఆరోపించారు. పార్టీలు మారిన వారిన ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పదవులు రావనే భయంతోనే పార్టీ పిరాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు.