ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోతే.. జరిగేది అదే : జనసేన - nadendla manohar

Nadendla: జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఫిబ్రవరి 28న గుంటూరు ఎస్పీకి సమాచారం ఇచ్చామని, డీజీపీకి దరఖాస్తు చేసుకున్నామని అయినా.. ఇంతవరకూ ఎలాంటి అనుమతీ ఇవ్వలేదన్నారు.

nadendla manohar in mangalagiri party office
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతాం

By

Published : Mar 9, 2022, 6:36 PM IST

Nadendla: జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పోలీసులు అనుమతి నిరాకరించారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సభకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం సరికాదని విమర్శించారు. సభ పెట్టుకునేందుకు ఒక రాజకీయ పార్టీగా తమకు హక్కు ఉందని మనోహర్ చెప్పారు.

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతాం

ఫిబ్రవరి 28న గుంటూరు ఎస్పీకి సమాచారం ఇచ్చామని, డీజీపీకి దరఖాస్తు చేసుకున్నామని, అయినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

మార్చి 14న నిర్వహించే సభ కోసం.. పార్టీ తరపున నియమించిన 12 కమిటీలతో నాదెండ్ల సమావేశమయ్యారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. కాకినాడ గ్రామీణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు.

ఇదీ చదవండి: జగన్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు.. "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసిన తెదేపా

ABOUT THE AUTHOR

...view details