చెడు వ్యసనాలకు లోనై చోరీలకు పాల్పడుతున్న దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లురూపేటకు చెందిన కచ్చారం మధుసూధనరావు గుంటూరులో చదువుకునేందుకు వచ్చి దొంగగా మారాడు.యూ ట్యూబ్ వీడియోల ద్వారా దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్న మధు...ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి ఆభరణాలు లాక్కెళ్లడం మొదలుపెట్టాడు. గతేడాది డిసెంబర్ 30న భారత్‌పేటలో, ఈనెల 8న శివాలయం రోడ్డులో మహిళల మెడలో నుంచి ఆభరణాలు తస్కరించాడు. దొంగలించిన సొత్తు బ్రాడీపేటలోని ఓ దుకాణంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
యూట్యూబ్ ద్వారా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు.... ఆ తర్వాత?
నెల్లూరు జిల్లా సూళ్లురూపేటకు చెందిన కచ్చారం మధుసూధనరావు గుంటూరులో చదువుకునేందుకు వచ్చాడు. చదువును మధ్యలోనే ఆపేసి.... డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీలు మొదలుపెట్టాడు. యూ ట్యూబ్ వీడియోల ద్వారా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని దారికాసి... వారి మెడలో నుంచి ఆభరణాలు లాక్కెళ్లటం మొదలుపెట్టాడు. ఎట్టేకేలకు పోలీసులకు దొరికాడు.
గొలుసు దొంగ అరెస్ట్