రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగఫలాలను వైకాపా ప్రభుత్వం గుర్తించడం లేదని, రైతులకు అండగా ఉంటామని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. అమరావతి కోసం ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిరసన చేపట్టారు. అమరావతి రైతులు ఏడాది కాలంగా పనులు మానుకుని ఉద్యమం చేస్తుంటే వైకాపా నాయకులకు కనిపించడం లేదని దుయ్యబట్టారు.
అమరావతి ఐకాస ఆధ్వర్యంలో గురవారం రాయపూడిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు వేలాది మందితో తరలి వెళ్లనున్నట్లు చదలవాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట అఖిలపక్షం నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.