ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు వెనక్కి పంపిస్తారా? లేక ఖర్చు పెడతారా? - Diversion of AYUSH Funds by State Govt

Ayurvedic hospitals : 65 కోట్ల రూపాయల ఆయుష్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతానికి వాడుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ డబ్బులు వెనక్కి పంపిస్తారా? లేక ఖర్చు పెడతారా? అని ప్రశ్నించింది. లేదంటే తదుపరి నిధుల విడుదలను నిలిపేయాలా అంటూ... రాష్ట్ర అధికారులకు హెచ్చరికలు పంపింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు.

Ayurvedic hospitals
Ayurvedic hospitals

By

Published : Feb 15, 2023, 9:25 AM IST

కేెంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు.. డబ్బులు వెనక్కి పంపిస్తారా? లేక ఖర్చు పెడతారా?

Ayurvedic hospitals : ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధవైద్య ఆసుపత్రుల అవసరాలకు కేంద్రం కేటాయించిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 2014-15 నుంచి 2019-20 సంవత్సరం వరకు... ఆయుష్‌ శాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా 145 కోట్లు కేటాయించాయి. వాటిలో ఇప్పటివరకు 65 కోట్లను ఖర్చు పెట్టకుండా... రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. దీనివల్ల రెండేళ్లుగా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. నిధుల్లేక అత్యవసర జాబితాలో ఉన్న మందులను కూడా రోగులు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. హోమియో మందులూ అరకొరగానే ఉన్నాయి.

ఆయుర్వేద, హోమియా, యునానీ, సిద్ధవైద్య ఆసుపత్రుల నిధులు మళ్లించడంపై... కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 65 కోట్ల నిధులను వెనక్కి పంపిస్తారా? లేక ఖర్చు చేస్తారా అని రాష్ట్రాన్ని ప్రశ్నించింది. లేదంటే తదుపరి నిధుల విడుదలను నిలిపేయాలా అని రాష్ట్ర అధికారులకు హెచ్చరికలు పంపింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు.

నిధులు, సిబ్బంది కొరతతో రాష్ట్రంలో ఆయుష్‌ ఆసుపత్రులు అతికష్టంగా నడుస్తున్నాయి. తగినన్ని మందులూ అందుబాటులో ఉండటం లేదు. దీనివల్ల రోగులకు ఆయుర్వేద, హోమియో, యునానీ, సిద్ధవైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. రాష్ట్రంలో ఆయుర్వేద ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కలిపి 377, హోమియో 251, నేచురోపతి 50, యూనానీ వైద్య కేంద్రాలు 94 ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా మూతబడ్డాయి. నడుస్తున్న వాటిల్లోనూ కొన్నిచోట్ల భవనాలు పాడయ్యాయి. మరుగుదొడ్డి, మంచినీటి సదుపాయం లేని ఆసుపత్రులూ ఉన్నాయి. బిల్లులు చెల్లించనందున కొన్ని ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా నిలిపేశారు.

ఈ సమస్యలతో ఆయుష్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మరమ్మతులకు నోచుకోక మూలనపడిన పరికరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కాకినాడలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, విశాఖలో డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ, డ్రగ్‌ ఫార్మసీ నిర్మాణాలపైనా నిధుల కొరత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ సదుపాయాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఉంది. అయితే... తొలి నుంచీ ఆయుష్‌ కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నందున... ఆయుర్వేద, హోమియో ఆసుపత్రుల ప్రాధాన్యం తగ్గిపోతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details