రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు - చంద్రబాబుకు బెయిల్‌తో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సహం Celebrations in Two Telugu States on Chandrababu Got Bail: స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి తమ సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల చంద్రబాబు చిత్రపటానికు పాలాభిషేకాలు చేశారు. న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా.. కోర్టులో స్పష్టమైన తీర్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
మచిలీపట్నంలో బాణసంచా కాల్చి సంబరాలు:స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మాంజూరు కావడంతో మచిలీపట్నంలోని.. టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు బెయిల్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ఇంతకీ ఏమని పేర్కొందంటే?
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం: ఏలూరు జిల్లా ఉంగుటూరులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కేక్ కట్ చేశారు.
అంబరాన్నంటిన సంబరాలు: కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనకాపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో బాణసంచా పేల్చి అధినేతపై అభిమానాన్ని చాటుకున్నారు. తగరపువలస అంబేద్కర్ జంక్షన్ వద్ద చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అధ్వర్యంలో స్వీట్స్ పంచిపెట్టారు. జిల్లాలోని రామభద్రపురంలో జాతీయ రహదారిపై కార్యకర్తలు ఉత్సాహంగా టపాసులు కాల్చారు.
వైసీపీ తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయి: నారా లోకేశ్
కొబ్బరికాయలు కొట్టి - మిఠాయిలు పంచి: అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మంత్రాలయంలో టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మఠంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబుకు బెయిల్ రావడంపై కర్నూలు న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. నెల్లూరు టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నివాసం వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.
తెలంగాణలోని పలు జిల్లాలో సంబరాలు : హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చారని.. ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, ఖమ్మం పట్టణంతో పాటు జిల్లాలోని తల్లాడ, భద్రాచలం, నిజామాబాద్ జిల్లా బోధన్, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు బెయిల్‌తో చంద్రబాబుకు పూర్తి స్థాయి స్వేచ్ఛ : న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్