ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుడిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: చంద్రబాబు - వైద్యుడిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాల వైద్యుడు సుధాకర్‌రావు సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు మరో లేఖ రాశారు.

cbn letter to cm jagan for doctor suspension
cbn letter to cm jagan for doctor suspension

By

Published : Apr 9, 2020, 10:08 AM IST

నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌రావు సస్పెన్షన్‌తో ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోధైర్యం దెబ్బతింటుందని.. వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేక సిబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్‌రావు వెల్లడించారన్న చంద్రబాబు... మాస్కులు, గ్లౌజులు అడిగిన వైద్యుడిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడాలేదని విమర్శించారు. అనంతపురం జిల్లాలో కూడా నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారన్న ఆయన.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సుధాకర్‌రావు వ్యాఖ్యలను సానుకూలంగా చూడాలే తప్ప.. ప్రతికూల చర్యలు తగవని హితవు పలికారు. క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న వారికి రక్షణ ఉపకరణాలు అందించడంపైనే ప్రభుత్వం దృష్టిపెట్టాలి తప్ప సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కాదని చంద్రబాబు లేఖ ద్వారా జగన్‌కు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details