గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామానికి చెందిన ఓ మహిళ 108 వాహనంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. 8 నెలల గర్భవతి వై.భవాని... శనివారం అర్ధరాత్రి ఆటోలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడి వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కి రిఫర్ చేశారు. 108 అంబులెన్స్ వాహనంలో గుంటూరు వెళ్తుండగా... మార్గమధ్యలో యడ్లపాడు వద్దకు రాగానే భవాని డెలివరీ అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 108 సిబ్బంది డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
'అంబులెన్స్ వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది' - guntur news
ఓ గర్భణీ 108 అంబులెన్స్ వాహనంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇబ్బంది లేకుండా 108 సిబ్బంది డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అంబులెన్స్ వాహనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది