ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందడం అమరావతి దీక్షా శిబిరంలో న్యాయ దేవత విగ్రహం ఏర్పాటు

న్యాయస్థానాల ద్వారానే అమరావతిని సాధిస్తామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆవిష్కరించారు.

Capital_Nyaya_Devatha_Statue
న్యాయదేవతే మమ్మళ్ని ఆదుకుంటోంది

By

Published : Aug 17, 2021, 2:14 PM IST

Updated : Aug 17, 2021, 3:31 PM IST

అమరావతి సాధన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరంలో న్యాయ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. సింగపూర్​కు చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు, మండవ సురేంద్ర మందడం దీక్షా శిబిరానికి న్యాయ దేవత విగ్రహాన్ని అందించగా.. మాజీ మంత్రి వద్దే శోభనాద్రీశ్వరరావు, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, రాజధాని ఐక్య కార్యచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ఆ విగ్రహన్ని ఆవిష్కరించారు.

రైతులంతా కలిసి న్యాయదేవత, న్యాయస్థానాల విగ్రహాలకు పుష్పాభిషేకం చేశారు. న్యాయస్థానాలే తమ దేవాలయాలు అంటూ నినాదాలు చేశారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం దక్కుతోందని, న్యాయదేవతే తమను ఆదుకుంటోందని రాజధాని ఐకాస కన్వీనర్ సుధాకర్, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి వెల్లడించారు.

రైతులు చేసే ఉద్యమంలో న్యాయం ఉంది కాబట్టే వారికి న్యాయ దేవత అండగా ఉంటుందని ప్రముఖ న్యాయవాది జంధ్యాల లక్ష్మీనారాయణ అన్నారు. న్యాయదేవత విగ్రహం ఏర్పాటు సందర్భంగా మందడం దీక్షా శిబిరానికి 29 గ్రామాల నుంచి తరలి వచ్చిన రైతులు.. హనుమాన్ చాలీసా పఠించారు.

ఇదీ చదవండి:బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Last Updated : Aug 17, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details