దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాన్వాయ్‌ను అమరావతి రైతులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో శ్రీసత్య సాయి ఆలయంలో ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సాయిబాబా దర్శనానికి వచ్చిన మంత్రిని చూసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
మంత్రి వెళ్లే సమయంలో ఆయన కారు చుట్టూ చేరి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు మంత్రి వెల్లంపల్లిని పంపించారు. రాజధాని గ్రామాల్లోనూ రైతులు 414వ రోజు నిరసనలు దీక్షలు కొనసాగించారు.