ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

97వ రోజు రాజధాని రైతుల ధర్నా - అమరావతి రైతుల నిరసన

కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్నా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ రాజధాని రైతులు ధర్నా చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ 97వ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా రాజధాని అమరావతిని సాధించుకునే వరకు పోరాటం చేస్తామని రైతన్నలు స్పష్టం చేశారు.

capital farmers agiation on 97th day at ponnuru
రాజధాని రైతుల 97వ రోజు ధర్నా

By

Published : Mar 23, 2020, 2:42 PM IST

రాజధాని రైతుల 97వ రోజు ధర్నా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాజధాని రైతులు 97వ రోజు ధర్నా చేస్తున్నారు. తాడికొండ అడ్డరోడ్డు శిబిరం రైతులు ... వారి గ్రామమైన పొన్నెకల్లులో ఇళ్లనుంచే నిరసన దీక్షలు చేపట్టారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. సీఎం జగన్ తన మనసు మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా రాజధాని అమరావతిని సాధించుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details