ఆర్థిక ఒత్తిళ్లే కారణమా..? గుంటూరు జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గిరిజ శంకర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలో డొంక రోడ్డు కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్న శంకర్, ట్రాయ్ నూతన నిబంధనల వల్ల ఆపరేటర్లకు నష్టం వాటిల్లుతోందని 3 రోజులుగా ఆందోళన చేస్తున్నాడు. కేబుల్ వ్యవస్థలో తీవ్రంగా నష్టపోవడం వల్లనే శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.