ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూపుదిద్దుకుంటున్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు

ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఆయన భారీ కాంస్య, ఫైబర్, విగ్రహాలు గుంటూరు జిల్లా తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంటున్నాయి.

br ambedkar statues
అంబేడ్కర్ విగ్రహాలు

By

Published : Mar 28, 2021, 2:05 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో భారీఎత్తున అంబేడ్కర్ మహనీయుని విగ్రహాలను తయారు చేస్తున్నారు శిల్పులు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా విగ్రహప్రతిష్ఠ కోసం.. విగ్రహాలను కళాకారులు అందంగా రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాలకు ప్రాణం పోసినంతగా అలంకరిస్తున్నారు. ఇవి మన రాష్ట్రంలోనేకాక.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని శిల్పులు చెబుతున్నారు.

జయంతి కోసం ప్రత్యేకంగా ఆర్డర్లు మీద విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారని వారు వివరించారు. అంబేడ్కర్ విగ్రహాలను ఆరు అంగుళాల నుంచి 16 అడుగుల వరకు రూపుదిద్దడంలో నైపుణ్యత కలిగి ఉన్నారని స్థానికులు తెలిపారు. ప్రత్యేకించి గాజు విగ్రహాలను చిత్రీకరిస్తారని అన్నారు. త్వరలో ఈ విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు తరలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details