గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ రావు నగర్లో విషాదం నెలకొంది. కాలనీలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల ప్రణీత్ ప్రమాదవశాత్తు బకింగ్‌హామ్ కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఎన్డీఅర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువ మొత్తం జల్లెడ పడుతున్నారు. బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో బాలుడి తండ్రికి ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఒక్కగానొక్క కుమారుడు గల్లంతవడంపై తల్లి రోదన చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
గుంటూరు: బకింగ్‌హామ్ కాలువలో బాలుడు గల్లంతు
బకింగ్‌హామ్ కాలువలో బాలుడు గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ రావు నగర్లో చోటుచేసుకుంది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
బకింగ్‌హామ్ కాలువలో బాలుడు గల్లంతు