గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. మాచర్ల శివారులోని క్వారీ గుంతలో ఆరేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడ్రోజుల క్రితం సాయి సాత్విక్ అలియాస్ సిద్ధు అపహరణకు గురయ్యాడు. సిద్ధును అపహరించి హత్యచేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి పిల్లలతో కలిసి వచ్చి ప్రమాదవశాత్తూ గుంతలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సిద్ధు అదృశ్యంపై ఈ నెల 22న తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా గాలింపు జరిపారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తన్నట్లు సీసీ పుటేజిలో కన్పించిన దృశ్యాలను పోలీసులు తొలుత విడుదల చేశారు. చివరకు అన్నీ నిర్థారించాక రైల్వేస్టేషన్లో కన్పించిన బాలుడు వేరే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మాచర్ల క్వారీలో ఆరేళ్ల బాలుడి మృతదేహం - boy dead
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. మాచర్ల శివారులోని క్వారీ గుంతలో ఆరేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడ్రోజుల క్రితం సాయి సాత్విక్ అలియాస్ సిద్ధు అపహరణకు గురయ్యాడు
మాచర్ల క్వారీలో ఆరేళ్ల బాలుడి మృతదేహం
ఇదీ చదవండి