Bopparaju On Village And Ward Secretariat Employees Problems : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసు సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల నియామకాలు జరిపి మూడేళ్లు గడుస్తున్నా.. ఇంకా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గుంటూరులో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు.. హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయలేదని తెలిపారు. గ్రామ, వార్డు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 27న ప్రత్యేక సమావేశం జరగనుందని బొప్పరాజు చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి: బొప్పరాజు - రెవెన్యూ సర్వీసు సంఘం అధ్యక్షుడు బొప్పరాజు
Bopparaju On Employees Problems : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు జరిపి మూడేళ్లు గడుస్తున్నా.. బదిలీలు జరగకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
bopparaju venkateswarlu