గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న విగ్రహానికి భాజపా నాయకులు రావెల కిశోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా గొప్ప కవి అని.. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కలం అనే ఆయుధంతో యుద్ధం చేసిన మహనీయుడని కీర్తించారు.
కవి కోకిల గుర్రం జాషువా తన కవితలతో కుల వివక్షను ఎదుర్కొన్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జాషువా జయంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెం రోడ్డులోని జాషువా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన గుంటూరు జిల్లా వాసి కావటం జిల్లాకు గర్వకారణం అన్నారు.