ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకనైనా కవ్వింపు చర్యలు చైనా మానుకోవాలి: భాజపా యువ మోర్ఛ - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

గుంటూరు జిల్లా లాల్జి సెంటర్​ అంబేడ్కర్​ కూడలి వద్ద భాజపా యువ మోర్ఛ ఆధ్వర్యంలో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనలు తెలిపారు. ఈ మేరకు భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్లకు భాజపా యువ మోర్ఛ నాయకులు ఘన నివాళులు అర్పించారు.

bjp leaders protest at guntur
'ఇకనైనా చైనా కవ్వింపు చర్యలు మానుకోవాలి': భాజపా యువ మోర్ఛ

By

Published : Jun 17, 2020, 6:39 PM IST

భారత్-చైనా సరిహద్దులో వీర మరణం పొందిన జవాన్లుకు భాజపా యువ మోర్ఛ నాయకులు ఘన ఘన నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ కూడలి వద్ద భాజపా యువ మోర్ఛ ఆధ్వర్యంలో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనలు తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్​ చేశారు. చైనా కవ్వింపు చర్యలను మానుకోవాలని భాజపా యువ మోర్ఛ నాయకుడు శ్రీనివాసరావు తెలిపారు.

చైనా తన తీరును మార్చుకోకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్​కు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇకనైనా చైనా కవ్వింపు చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రపంచపటంలో చైనా కనిపించకుండా పోవడం ఖాయమన్నారు.

ఇవీ చూడండి:చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు

ABOUT THE AUTHOR

...view details