కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని గుంటూరు జిల్లా తెనాలిలో బాజపా నాయుకులు నిరసన దీక్ష చేపట్టారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి వెంటిలేటర్లు ఇచ్చినా.. వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని బాధితులకు సరైన చికిత్స అందించాలని సూచించారు.
కొవిడ్ నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలం: భాజపా - గుంటూరు జిల్లా తెనాలి తాజా వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలో భాజపా నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. కరోనా కట్టిడి, బాధితులకు వైద్యం అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
కొవిడ్ నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలం