భాజపా నేత సాధినేని యామిని పార్టీ కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలోని ఎర్రకొండపై నిర్మిస్తున్న ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. ప్రార్థనా మందిరాన్ని చూడటానికి వెళ్లిన తనను అక్కడి నిర్వాహకులు అడ్డుకున్నట్లు యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అడ్డుకున్నారని ఒకరు ...కులం పేరుతో దూషించారని మరొకరు ఫిర్యాదు - bjp leader yamini news
గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద నిర్మిస్తున్న ప్రార్థనా మందిరాన్ని భాజపా నాయకురాలు సాధినేని యామిని సందర్శించారు. తనను అక్కడి నిర్వాహకులు అడ్డుకున్నారని యామిని, తమను కులం పేరుతో దూషించినట్లు ప్రార్థనా మందిరం నిర్వాహకులు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
యడ్లపాడు ప్రార్థనా మందిరాన్ని సందర్శించిన యామిని
ప్రార్థనా మందిర నిర్వాహకులు కూడా సాధినేని యామినిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రార్థనా మందిరాన్ని చూడడానికి వచ్చిన ఆమె కులం పేరుతో తమను దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి