గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమిని గెలిపిస్తే... ఇంటి ప్రణాళికల కోసం ఎమ్మెల్యేలకు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నగరంలోని 18, 35 డివిజన్లలో పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. గత ఏడేళ్లుగా తెదేపా, వైకాపా ప్రభుత్వాలు గుంటూరు నగర అభివృద్ధికి చేసిందేమీ లేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరు నగరాన్ని గత ప్రభుత్వాలు పెద్ద పల్లెటూరుగా మార్చాయని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ విమర్శించారు.
'నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమిని గెలిపించండి' - guntur latest news
గుంటూరులోని 18, 35 డివిజన్లలో భాజపా కార్యాలయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ