రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు మిన్నంటుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 72 రోజుల నుంచి రైతులు, మహిళలు ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది రాజధాని కోసం విభిన్న రీతుల్లో తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. తుళ్లూరు గ్రామంలో వెంపరాల మధు తన నివాసంలో భవగ్ని మహాశాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవగ్ని ఆశ్రమం నుంచి భక్తులు వచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ యాగాలు చేశారు.
అమరావతి రాజధానిగా కొనసాగాలని తుళ్లూరులో 'భవగ్ని మహాశాంతి యజ్ఞం'
అమరావతిలో రాజధాని కొనసాగించాలనే సంకల్పంతో రైతులు విభిన్న రీతుల్లో తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. తుళ్ళూరు గ్రామంలోని వెంపరాల మధు అనే రైతు తన నివాసంలో భవగ్ని మహాశాంతి యజ్ఞం నిర్వహించారు.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తుళ్లూరులో 'భవగ్ని మహశాంతి యజ్ఞం'