ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్భర దారిద్ర్యంలో జీవనం.. అయినా గుర్తింపు దొరకని దైన్యం - బీడబుడగ జంగం ప్రజల వార్తలు

ఊరికి దూరంగా నివసిస్తారు... ఎలుకలు, ఉడుములు వేటాడుతూ జీవిస్తారు. పొట్ట నింపుకునేందుకు భిక్షాటన చేస్తారు. దుర్భర దారిద్ర్యం, వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నా సామాజిక వర్గం పరంగానైనా ప్రభుత్వ గుర్తింపు లేని దుస్థితి. ఎస్సీ జాబితా నుంచి తొలగిస్తూ జరిగిన అన్యాయంపై బేడ బుడగ జంగాల మనోవ్యథ ఇది.

beeda budaga jangam social category people
బీడ బుడగ జంగం ప్రజలు

By

Published : Sep 25, 2020, 2:21 PM IST

తీవ్ర వెనుకబాటుతనంతో కునారిల్లిపోతున్నా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి గుర్తింపునకూ నోచుకోక బేడ బుడగ జంగం సామాజిక వర్గం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1976 నుంచి 2014 వరకు బేడ బుడగ జంగాలకు ఎస్సీలుగా గుర్తింపు ఉండేది. విభజన అనంతరం తెలంగాణలో యథావిధిగా ఎస్సీ జాబితాలోనే కొనసాగినా... మన రాష్ట్రంలో మాత్రం 144 జీవో ప్రకారం తొలగించారు. దీనిపై తెలుగుదేశం ప్రభుత్వం ఏక సభ్య కమిషన్‌ను వేసింది. వైకాపా ప్రభుత్వం జేసీ శర్మ కమిషన్‌ను నియమించింది. జూన్ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందింది. అత్యంత వెనకబడిన వీరిని తిరిగి ఎస్సీ జాబితాలో కొనసాగించాలని కమిషన్ తేల్చింది. అయితే.. ఇప్పటికీ దానికి ఆమోదం లభించలేదు.

ఊరికి దూరంగా ఉడుములు, ఉడతలు, నత్తలు, పిట్టలు వేటాడుతూ బతికే జీవన విధానమే బేడ బుడగ జంగాల దుర్భర స్థితికి నిదర్శనం. యాచక వృత్తితో పాటు తంబూర, తందాన కథలు చెబుతారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వారి ఉనికి ఉండగా... కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. మహిళలు ఈత చాపలు అల్లి సంతలో విక్రయిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక భాష ఉన్నా.. లిపి మాత్రం లేదు. వివాహాల్లో అమ్మాయికి 116 రూపాయల కన్యాశుల్కం ఆచారం పాటిస్తారు. ఈ వర్గంలోని పిల్లలంతా తగిన విద్య లేకుండా వీధి బాలలుగానే మిగిలిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details