ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్​ - BAIRI NARESH ARREST

BAIRI NARESH ARREST : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

BAIRI NARESH ARREST
BAIRI NARESH ARREST

By

Published : Dec 31, 2022, 2:42 PM IST

BAIRI NARESH : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం రావులపల్లిలో ఈ నెల 19న బైరి నరేశ్‌ అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదస్పదంగా మారింది.

ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయ్యప్పస్వాములు ఆందోళన చేపట్టారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందువాహిని, అయ్యప్ప మాలధారణ సభ్యులు అతడిపై కొడంగల్‌ పోలీస్‌ఠాణాలో ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో కూడా అతడిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details