ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ, కేసీఆర్ డైరెక్షన్​లోనే వైకాపా మేనిఫెస్టో: వైవీబీ - విమర్శలు

"మోదీ, కేసీఆర్ డైరెక్షన్​లోనే వైకాపా మేనిఫెస్టో రూపొందించారు. రాజధాని, పోలవరం, బీసీలు ఇలా ముఖ్యమైన అన్ని అంశాలను విస్మరించారు" బాబూ రాజేంద్రప్రసాద్

babu-rajendraprasad-criticise-jagan

By

Published : Apr 7, 2019, 1:24 PM IST

Updated : Apr 7, 2019, 3:26 PM IST

రాజధాని తరలించేందుకు జగన్ కుట్ర: బాబూ రాజేంద్రప్రసాద్

రాజధానిని తరలించడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధానిపై వైకాపా మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బీసీలంటే జగన్​కు చులకన భావమనీ.. వారికి ఏం చేస్తామనేది పేర్కొనలేదని విమర్శించారు. వారు పేదరికంలోనే ఉండాలని ప్రతిపక్షనేత కోరుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతిపైనా మేనిఫెస్టోలో ప్రస్తావించలేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతిని 2 వేల నుంచి 3 వేలకు పెంచుతామన్నారు. కేసీఆర్, మోదీల డైరెక్షన్​లోనే జగన్​ మేనిఫెస్టోను రూపొందించారని ధ్వజమెత్తారు.

Last Updated : Apr 7, 2019, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details