రైతులకు పంట విత్తనాలపై అవగాహన కల్పించాలని గుంటూరు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు విజయభారతి ఎంపీవోలకు సూచించారు. నరసరావుపేటలో వ్యవసాయాధికారులు, వ్యవసాయవిస్తీరణాధికారులు, ఎంపీవోలతో ఆమె సమావేశం నిర్వహించారు. రాబోయే సీజన్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.
వర్షాలు వచ్చిన తరువాత విత్తు కోవడం జరుగుతుంది కాబట్టి ఈ లోపు వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీవోలు చేయవలసిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మట్టి నమూనా సేకరణ, పచ్చిరొట్టె పంటలైన జొన్న, జీలుగ, పిల్లిపిసర విత్తనాలు రైతులకు 70 శాతం సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం మట్టి పరీక్ష చేసిన తరువాత రైతులకు భూసార కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ కార్డులు రైతులందరికీ చేర్చడం, వాటిని రైతులు భద్ర పరుచుకునేలా చేయడం లాంటి కార్యక్రమాలు చేయాలని ఎంపీవోలకు సూచించారు.
'రైతులకు పంట విత్తనాలపై అవగాహన కల్పించాలి' - farmers
రైతులకు పంట విత్తనాలపై అవగాహన కల్పించాలని గుంటూరు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు విజయభారతి ఎంపీవోలకు సూచించారు.
రైతులకు పంట విత్తనాలపై అవగాహన
ఇదీ చదవండి