గుంటూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దాచేపల్లి మండలం బట్రుపాలెం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీకాంత్, నాగవర్ధిని జంట.. రహస్యంగా పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్నిపెద్దలు అంగీకరించని కారణంగా.. మనస్థాపానికి గురై ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం - Lovers Suicide
ప్రేమ జంట
18:46 August 21
Lovers suicide attempt
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాచేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వారిని గుంటూరు తరలించారు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 21, 2021, 7:30 PM IST