బాలికపై ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో జరిగింది. గారపాటి ప్రకాశ్‌రావు అనే వ్యక్తి.. ఓ ప్రైవేటు పాఠశాలలో బస్సు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికకు.. కరోనా నేపథ్యంలో పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటుంది. చిన్నారి తల్లిదండ్రులు పొలానికి వెళ్లడాన్ని గమనించిన ఆ కామాంధుడు... చాక్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని చిన్నారికి ఆశ చూపాడు. సమీపంలోని తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలిక పరిస్థితిని గమనించి విచారించారు. విషయం తెలుసుకుని... చిన్నారి తల్లి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. పరారైన నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులు... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డబ్బులిస్తానని ఆశ చూపి... చిన్నారిపై అత్యాచారం - నాందెడ్ల మండలంలో చిన్నారిపై అత్యాచారం వార్తలు
ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకున్నాడు చిన్నారిపై కన్నేసిన ఆ కామాంధుడు. డబ్బులిస్తానని ఆశ చూపించి... అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
attempt to Rape on a child at nadendhala mandal in guntur