ASHA Workers Protest in AP :సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు 36 గంటల ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి డిమాండ్ చేశారు. పపని భారం తగ్గించి, ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏదైనా ఒక విధానాన్ని మాత్రమే అప్పగించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు కూడా 62 ఏళ్లకు పదవీ విరమణ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
YSRCP Government Cheating ASHA Workers :తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు నంద్యాలలో ఆందోళన చేశారు. నంద్యాల కలెక్టరేట్ సమీపాన ప్రధాన రహదారిపై బైఠాయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.
ఆల్ ఇన్ వన్‌గా వాడుకుంటూ అరకొర జీతాలు - వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తిన ఆశా కార్యకర్తలు
ASHA Workers Situation in Andhra Pradesh :ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. విజయవాడ అలంకార్ సెంటర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వేలాదిమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, పింఛన్ 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.