హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చోరీ కేసు.. నిందితుడి అరెస్టు - హెచ్‌డీఎఫ్‌సీ
17:38 August 18
HDFC Bank robbery
గుంటూరు గాంధీ పార్క్ ఎదుట ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆగస్టు16 తెల్లవారుజామున జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు రాజేశ్ కుమార్ అని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.20 లక్షలు, లక్షా 28 వేల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాస్ కట్టర్, టిన్, రంపం బ్లేడుతో షట్టర్, బ్యాంకు లాకర్‌ను పగలగొట్టిన నిందితుడు రూ.23 లక్షలు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. చెడువ్యసనాలకు అలవాటుపడి ఇలా నిందితుడు పక్కదారి పట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:బ్యాంక్‌లో చోరీ.. రూ.23లక్షలు అపహరణ