గుంటూరు జిల్లాలోని 3 పార్లమెంట్, 17 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు చోట్ల జరగనుందని... దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు పేర్కొన్నారు. కౌంటిక్ ప్రక్రియలో విధులు నిర్వహించే డిఎస్పీ, సీఐ, ఎస్ఐ తదితర పోలీస్ సిబ్బందితో గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 10 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని... స్థానిక లయోలా పబ్లిక్ స్కూల్ లో 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ ఓట్లు లెక్కింపు వద్ద డీఎస్పీ స్థాయి సిబ్బంది ఉంటారని అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఎన్నికల సిబ్బంది తప్పా మరెవరికి లోనికి అనుమతి లేదన్నారు. మీడియా వారికి డీపీఆర్వో ఎప్పటికి అప్పుడు సమాచారం అందచేస్తారని పేర్కొన్నారు.
'అనుమతి లేకుండా బాణసంచా కాల్చొద్దు'
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గుంటూరు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఓట్ల లెక్కింపు రోజున యూనివర్సిటీ మీదగా సర్వీస్ రోడ్డులో వచ్చే వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌కి అంతరాయం కలగుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 23 వ తేదీన కౌటింగ్ కేంద్రాలు వద్ద పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు అమలు లో ఉంటాయన్నారు. రాజకీయ నాయకులు బాణసంచా, ర్యాలీలు వంటివి చేయడానికి అనుమతి లేదన్నారు. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ మీదగా వచ్చే వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు సమయంలో ఎవరైనా అల్లారులకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని అర్బన్ ఎస్పీ హెచ్చరించారు.