నేటి నుంచి షర్మిల బస్సు యాత్ర - sharmila
ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉన్నందున ప్రచారంలో తన సోదరుడికి సాయం చేసేందుకు షర్మిల నడుం బిగించారు. బస్సు యాత్ర పేరుతో నేటి నుంచి రాష్ట్రమంతా పర్యటించనున్నారు.
జగన్ సోదరి వైఎస్ షర్మిల నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైకాపా తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయం నుంచి బస్సు షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులతో తాడేపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆమె సమావేశం కానున్నారు. తరువాత ఉండవల్లిలోని సాయి బాబా దేవాలయం వద్ద పసుపు రైతులతో భేటీ అవుతారు. సాయంత్రం 5.30 గంటలకు మంగళిగిరిలోని పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభకు హాజరవుతారు.