- కృష్ణ మృతితో టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం.. షూటింగ్స్ బంద్
సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూయడం వల్ల టాలీవుడ్ చిత్రసీమ శోకసంధ్రంలో మునిగిపోయింది. అభిమానులు సెలబ్రిటీలు కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం అధికారికంగా సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంత ఎదిగినా, సొంతూరుపై మమకారం చూపించేవారు: బుర్రిపాలెం వాసులు
సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంత స్థాయికి ఎదిగినా సొంత ఊరిపై కృష్ణ మమకారం చూపించేవారని.. గ్రామస్థులు అంటున్నారు. గ్రామానికి తరచుగా రావటంతో పాటు కొన్ని సినిమాల షూటింగ్ కూడా అక్కడే చేశారని అంటున్నారు. గ్రామాభివృద్ధికి చాలా కృషి చేశారని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గుర్తుచేసుకుంటున్నారు. అక్కడి పరిస్థితి పై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆహారం కోసం వెళ్లి.. ఆపదలో పడిన ఏనుగు..
ఓ ఏనుగు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆపద కొనితెచ్చుకుంది. అడవిలో ఉండాల్సిన గజరాజు ఆహారం కోసం పంట పొలాల్లోకి వచ్చి అకస్మాత్తుగా బావిలో పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీటిలో పడిన ఏనుగును జేసీబీ ని ఉపయోగించి.. అటవిశాఖ సిబ్బంది బయటకు తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కృష్ణ మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
సూపర్‌స్టార్ కృష్ణ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు వెండితెర కౌబాయ్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పామును ముద్దాడబోయి ప్రాణాలు కోల్పోయిన సంరక్షకుడు
పామును పట్టుకొచ్చిన ఓ స్నేక్ క్యాచర్.. దాన్ని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పాము అతడి పెదవిపై కాటు వేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాశిక్‌లో జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక.. దిల్లీ ఎయిమ్స్‌లో ఘటన!
రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక రావడం వల్ల కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆస్పత్రి అందిస్తున్న ఆహార నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం కనుగొనాలి'... ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు
ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.953 పెరిగి రూ.64,190 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్..? అతడేనా?
టీమ్ఇండియాకు కొత్త సారధిగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ స్థానానికి హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లలో ఒకరిని కెప్టెన్ చెయ్యాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే తాజాగా మరో పేరు వినిపించడం చర్చకు దారి తీస్తోంది. ఇంతకి ఆ క్రికెటర్ ఎవడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్.. ఆ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత ఆయనదే
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా మల్టీస్టారర్, రీమేక్ చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. ఓ సారి ఆయన నటించిన రీమేక్ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.