- విషాదాన్ని మిగుల్చుతున్న బాణసంచా తయారీ కేంద్రాలు
పేరుకు ఉపాధి.! కానీ తేడా వస్తే ప్రాణాలే సమాధి. ఏరుకోడానికి ఎముకలు మిగలవు. మనుషుల ఆనవాళ్లూ దొరకవు. అంతటి విషాదాన్ని మిగిల్చే బాణసంచా తయారీ కేంద్రాలు పచ్చని పల్లెల్లో కుంపట్లలా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి.. పరిమితికి మించి వాడుతున్న మందుగుండు సామాగ్రి భయోత్పాతం సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తల్లులు జాగ్రత్త!... పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తున్నారు
How to behave with children: సౌజన్య నోరు తెరిస్తే ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి ఉన్నవీ లేనివీ చెబుతూ ఉంటుంది. అమ్మను చూసి పదేళ్ల రమ్య కూడా స్కూల్ నుంచి రాగానే తోబుట్టువులు, టీచర్, సహ విద్యార్థులపై చాడీలు మొదలుపెడుతుంది. ఈ అలవాటు బంధాలను దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే దానిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీపీఎస్ రద్దు పోరాటం జనవరి నుంచి ఉద్ధృతం: యూటీఎఫ్
Struggle to abolish CPS in Parvathipuram: సీపీఎస్ రద్దు పోరాటాన్ని జనవరి నుంచి మరింత ఉద్ధృతం చేస్తామని యూటీఎఫ్ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటానికి సిద్ధం కావాలని.. అందుకు ఉద్యోగ సంఘాలు సైతం కలిసివస్తాయని చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సినీ నటుల నడుమ ఉత్సాహంగా వైజాగ్ నేవీ మారథాన్
విశాఖ సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ - 22 ఉత్సాహంగా సాగింది. రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించిన మారథాన్‌లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నూతన ఉత్సాహంతో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొన్నారు. ఈ సూదూరమైన పరుగుల పోటిని నటుడు అడవి శేషు ప్రారంభించారు. నాలుగు కేటగిరిల్లో జరిగిన ఈ మారథాన్లోఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి 18 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మారథాన్ డైరెక్టర్ నన్నపనేని మురళి తెలిపారు. భారీ సంఖ్యలో నేవీ ఉద్యోగులతో పాటు చిన్నా, పెద్దా, చివరికి దివ్యాంగులు కూడా మేము సైతం అంటూ.. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని నేవీ ఉన్నతాధికారి నాయర్ తెలిపారు. మారథన్‌లో పాల్గొని పూర్తి చేసుకున్న వారికి నిర్వాహకులు పతకాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టికెట్ ఇవ్వలేదని స్తంభం ఎక్కి మాజీ కౌన్సిలర్ హల్చల్
దిల్లీలో ఓ మాజీ కౌన్సిలర్ హల్చల్ చేశారు. త్వరలో జరగబోయే దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహించిన ఆప్ మాజీ కౌన్సిలర్ హజీబ్ ఉల్ హసన్ విద్యుత్ స్తంభం ఎక్కారు. తనకు టికెట్ కేటాయించే వరకు దిగబోనని తేల్చి చెప్పారు. ఈ ఘటన శాస్త్రీ పార్కు మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తనను మోసం చేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన
పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రిక్ బైక్‌లుగా మారుస్తారని మీకు తెలుసా? రాజస్థాన్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఈ వినూత్న ఆలోచనతో ఓ ఆటో మొబైల్ కంపెనీని ప్రారంభించింది. ఆ కంపెనీ గురించి తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుతిన్ వస్తే నేను రాను..' జీ 20 సదస్సులో ఫ్యామిలీ ఫొటో మిస్
G 20 2022 Summit : రష్యా అధ్యక్షుడు పుతిన్ జీ 20 సమావేశాలకు హాజరు కావడం లేదని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతున్నారు. మరోవైపు పుతిన్ వస్తే తాను రానని చెప్పారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్డీ రేట్లు పెరిగాయని పాత FDలు రద్దు చేస్తే లాభమా, నష్టమా?
ఒకప్పటి వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో తమ సొమ్మును తక్కువ వడ్డీకి జమ చేసిన వారు.. తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగా..' సైకిల్‌పైనే అకాడమీకి.. కఠోర శ్రమతో జట్టులోకి
అర్ష్‌దీప్ సింగ్.. టీమ్ ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం. టీ 20 వరల్డ్‌కప్ మొదటి సారి ఆడుతున్నా.. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడికి గురిచేయగల సత్తా అతడి సొంతం. స్వల్ప వ్యధిలోనే భారత జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన ఈ యువ సంచలనం గురించి కొన్ని విషయాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సంక్రాంతికి ఆ సినిమాలకే ప్రాధాన్యం'.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం
అనువాద చిత్రాల విడుదలపై మరోసారి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి, దసరా పండుగలు ఎగ్జిబిటర్లు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ఈ విషయం ఇప్పుడు సినీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.