ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను ఎదుర్కొనేందుకు 'ఆయుష్' మందు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హోమియో మందు సిద్ధమైందని.. ఆయుష్ వైద్యులు తెలిపారు. తాము తయారుచేసిన మందుతో మనిషి రోగనిరోధక శక్తి పెరిగి కొవిడ్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు.

ap state ayush department made homeo medicine for corona
కరోనాను ఎదుర్కొనేందుకు 'ఆయుష్' మందు!

By

Published : Apr 23, 2020, 5:45 PM IST

ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్​మెంట్ కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు హోమియో మందులను సిద్ధం చేసింది. 'ఆర్సీనిక్ ఆల్బా 30' అనే హోమియో మెడిసిన్​ను తయారు చేసింది. ఇది వాడటం వలన కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని హోమియో డాక్టర్లు చెబుతున్నారు. వీటితో మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఈ మందు అందేలా చర్యలు చేపట్టారు.

ఆయుష్ డిపార్ట్​మెంట్ కమిషనర్ ఉషా కుమారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతాల్లో హోమియో మందును పంపిణీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 25 వేల 1 డ్రామ్ బాటిళ్లను పంపిణీ చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఒక్కో బాటిల్ లో ఉండే హోమియో మందును కుటుంబంలోని 6 మంది సభ్యులు వాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.

ఇలా వాడాలి...

* 5 సంవత్సరాల లోపు పిల్లలు రోజుకు 3 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది.

* 5 సంవత్సరాల పైబడిన వారు రోజుకు 6 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది.

* ఈ మందులను చేత్తో పట్టుకోకుండా బాటిల్ మూత సహాయంతో వేసుకోవాలి.

ఈ నేపథ్యంలో ఆయుష్ ప్రతినిథులు హోంమంత్రి మేకతోటి సుచరితకు హోమియో మందును అందించారు. గుంటూరు జిల్లా నోడల్ ఆఫీసర్ బాబు బాలాజీ ప్రకాశ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యబాబు, డాక్టర్ రాగలతలు హోంమంత్రికి హోమియో మందులను అందించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి ఈ మందులను పంపిణీ చేస్తామని హోంమంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

కరోనా వేళ: మనిషికి మనిషే తోడు

ABOUT THE AUTHOR

...view details