రేషన్ డీలర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ వస్తున్న వార్తల పట్ల రేషన్ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గుంటూరులో సమావేశమైన రేషన్ డీలర్లు.... గ్రామీణ వలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డీలర్ల సంఘం నాయకులు సీఎం జగన్ని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో మమేకమయ్యామని... మిగతా శాఖల్లో మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం తమకూ గౌరవ వేతనాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించనున్నామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఏవీ ప్రసాదరావు తెలిపారు.
గౌరవ వేతనం కోసం రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ - cm
రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. తమకు గౌరవ వేతనం కల్పించాలని వేడుకుంది.
రేషన్ డీలర్ల సంఘం