ఐకానిక్ కు అదిరే స్పందన - amaravathi
నవ్యాంధ్రను సిలికానాంధ్రగా చేయాలని ఆకాంక్షిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ప్రవాసాంధ్రులు స్పందిస్తున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీ ఎన్నాఆర్టీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఐకాన్ టవర్ నిర్మాణానికి భాగస్వాములయ్యేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు.
ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఐకాన్ టవర్ నిర్మాణానికి భాగస్వాములయ్యేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఫ్లాట్ల కొనుగోలుకు ఆన్లైన్ లో నిర్వహించిన బుకింగ్‌కు గంట వ్యవధిలోనే 142 ఫ్లాట్లు అమ్ముడవటం అమరావతి బ్రాండ్‌కు లభిస్తోన్న ఆదరణగా అధికారులు తెలుపుతున్నారు.
కృష్ణా నదికి దగ్గర్లో రాయపూడి రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల్లో ఏపీ ఎన్ఆర్టీ నిర్మిస్తున్న 'ఎన్నార్టీ ఐకాన్' లో ఫ్లాట్ల కొనుగోలుకు అనూహ్య స్పందన లభించింది. సుమారు 500 కోట్లతో అత్యాధునిక హంగులతో 33 అంతస్థుల భవనం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో 150 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. వీటిని వాణిజ్య కార్యాలయాలకు, నివాసం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో రివాల్వింగ్ హోటల్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు ఉంటాయి.