AP JAC Amaravati Chairman Bopparaju: ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా.. జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రెండేళ్ల నుంచి భరిస్తూ వస్తున్నామని.. కానీ ప్రభుత్వానికి ఇది అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు, పెన్షన్లు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదన్నారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. బకాయిలు అడగకూడదనే.. ప్రభుత్వం మా జీతాలు ఆలస్యం చేస్తుందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు.
బకాయిలు అడగకూడదని.. జీతాలు ఆలస్యం చేస్తున్నారా..? : బొప్పరాజు - ఏపీ ఉపాధ్యాయుల సమస్యలు
AP JAC Amaravati Chairman Bopparaju: ఉపాధ్యాయులకు ప్రభుత్వం జీతాలు చల్లించకపోవటంపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి భరిస్తూ వస్తున్నామని.. కానీ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు.
ఉద్యోగి పదవి విరమణ చేయాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా సీపీయస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ, జీతభత్యాల చెల్లింపు చేస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని.. కానీ ఆ హమీని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇలాగే మెండిగా వ్యవహరిస్తే.. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని జేఏసీ నేత వై. వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వానికి తాము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా.. తమను ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బకాయిలు చెల్లింపు, ఒకటో తేదీన జీతభత్యాల చెల్లింపుపై సీఎం జగన్ సమావేశం నిర్వహించాలన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చ చేసి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: