మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వ చర్చలు విఫలం- సజ్జల వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 6:22 PM IST
|Updated : Jan 2, 2024, 6:52 PM IST
18:19 January 02
సమాన పనికి సమాన వేతనం అనేది కల అని వ్యాఖ్యానించిన సజ్జల
AP Govt Discussions Fail With Municipal Workers: మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లకు ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో కార్మికులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ చర్చల్లో కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్ సహా ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో ఓట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యూలర్ చేసి సమాన పనికి సమాన వేతనం అందించాలని మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. బేసిక్, హెల్త్ అలవెన్స్ కలిపి ఇవ్వాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్పందించిన మంత్రులు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాధ్యం కాదని కార్మిక సంఘాలకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా సమానపనికి సమాన వేతనం అనేది కల అని ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యనించారు.