సభాపతి కోడెలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో చేశారు. నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్ కు తరలించారు
సభాపతి పై విచారణ జరపాలి
By
Published : Feb 16, 2019, 11:29 AM IST
సభాపతి పై విచారణ జరపాలి
సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అఖిల పక్షంలో ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీపీఐ, వైకాపా, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు చేపట్టరాదని పోలీసులు విజ్ఞప్తి చేశారు.