ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిక్షణం ప్రజాహితం.. అభివృద్ధే లక్ష్యం -ధూళిపాళ్ల - తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్.

"ప్రతిక్షణం ప్రజాసంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేశాం. కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ... 7 ఎత్తిపోతల పథకాలకు 4కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా.. ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. గెలుస్తామని ధీమాగా ఉన్నాం. -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్

By

Published : Apr 1, 2019, 6:06 PM IST

తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్
తెదేపాకు కంచుకోట... ధూళిపాళ్ల కుటుంబానికి తిరుగులేని మద్దతు ఉన్న నియోజకవర్గం పొన్నూరు. 1983 నుంచి వరుసగా 3సార్లు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి విజయం సాధించగా...1994 నుంచి ఆయన కుమారుడు నరేంద్రకుమార్ గెలుస్తూ వస్తున్నారు. చేసిన అభివృద్ధితో... ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామంటున్నారు తెదేపా అభ్యర్థి నరేంద్ర కుమార్.

ప్రతిక్షణం... ప్రజాహితం...

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి... నియోజకవర్గాన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు ధూళిపాళ్ల నరేంద్రకుమార్. తండ్రి వారసత్వం పునికిపుచ్చుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ఈసారీ పొన్నూరులో తెదేపా జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు. పదేళ్లలో కాంగ్రెస్​ చేయని అభివృద్ధి ఈ ఐదేళ్లలో చేశామని... అదే తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్న ఆయన తన నియోజకవర్గ ప్రగతి నివేదిక వెల్లడించారు.

పొన్నూరు ప్రగతి :

  • రూ.443 కోట్లతో 143 కి.మీ మేర రహదార్ల విస్తరణ పనులు

  • రూ.100 కోట్లతో గ్రామాలకు రోడ్ల నిర్మాణం

  • చేబ్రోలులో రూ.200కోట్లతో నీటి శుద్ధీకరణ యంత్రాల ఏర్పాటు

  • చెరువులు, కాలువల పునరుద్ధరణ

రూ.2.70 కోట్లతో 27 గ్రామాల్లో బీసీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు

  • చంద్రన్న బీమా ద్వారా రూ. 17కోట్ల వరకు ఆర్థిక సాయం

  • పొన్నూరు పట్టణంలో రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు

  • పసుపు-కుంకుమ, చంద్రన్న బీమా వంటి సంక్షేమ పథకాల అమలు

  • ​​​​​​​

    ఇవి చదవండి

    మాకు ఎవరితో పొత్తు లేదు.. ఆ అవసరమూ లేదు!

    ABOUT THE AUTHOR

    ...view details