గుంటూరు జిల్లా రేపల్లెలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాస్ బాపట్ల ఎంపీ అభ్యర్థి జే.డి శీలంతో కలిసి ప్రచారం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపారు. భాజపా హయాంలో ఉగ్రదాడులు పెరిగాయని విమర్శించారు. మోదీ ప్రధాని కాకముందే దేశంలో విద్య, వైద్య,సాంకేతిక ,అంతరిక్ష రంగాలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారు: సినీ నటి నగ్మా - GNT
గుంటూరు జిల్లా రేపల్లెలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాస్ బాపట్ల ఎంపీ అభ్యర్థి జే.డి శీలంతో కలిసి ప్రజలను ఓట్లు వేయాలని కోరారు.
ఏపీ ప్రజలను మోదీ మోసం చేశారు: సినీ నటి నగ్మా