గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూములను కలెక్టర్ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు పరిశీలించారు. నిన్న జిల్లాలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిన కారణంగా.. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ఆలస్యమైంది. నేటి ఉదయం నుంచి నాగార్జున విశ్వవిద్యాలయంలో 24 స్ట్రాంగ్ రూముల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లను భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్, పోలింగ్ ఏజెంట్లు... పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. సీఆర్ఫీఎఫ్ బలగాలను భత్రతగా మోహరించారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి చీఫ్ ఏజెంట్ల చరవాణులకు సీసీ కెమెరాల పర్యవేక్షణ లాగిన్లను అందించనున్నారు. ఈ సదుపాయంతో.. వారు ఏ సమయంలోనైనా ఈవీఎంల భద్రతను ప్రత్యక్షంగా చూసుకునే అవకాశం కల్పించారు.
ఏఎన్‌యూలో 24 స్ట్రాంగ్ రూమ్‌లు.. భారీ భద్రతలో ఈవీఎంలు - GNT
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని 24 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు. వీటిని కలెక్టర్, కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లు పరిశీలించారు. ఈవీఎంలు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు