ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జ్ఞాన ప్రదాతల సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా' - ap cs

వేదం నేర్చుకున్నా వేద పండితులు కేవలం ధనార్జనకు ప్రాధాన్యం ఇవ్వకుండా జనాసముపార్జనకు పాటుపడే విధంగా ఉండాలని ప్రభుత్వ సీఎస్​ లంక వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన వేద పరీక్ష, పండిత సన్మానాల సభలకు ముఖ్యఅతిథిగా హాజరైనారు.

జ్ఞాన వైరాగ్యం కలిగిన సభలో పాల్గొనడం సంతోషం

By

Published : May 13, 2019, 6:34 AM IST

Updated : May 13, 2019, 7:13 AM IST

జ్ఞాన వైరాగ్యం కలిగిన సభలో పాల్గొనడం సంతోషం

గుంటూరు జిల్లా తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా వేద పరీక్ష, పండితుల సన్మానాలు జరిగాయి. 95వ పరీక్ష, పండితుల సన్మాన సభలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. బ్రహ్మశ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రికి గండపెండేరాన్ని సీఎస్​ చేతుల మీదుగా బహుకరించారు. వేదం నేర్చుకున్న వేద పండుతులు కేవలం ధనార్జనకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలకు జ్ఞానం అందించేందుకు పాటుపడాలని సీఎస్​ సూచించారు. అంతే కాకుండా వేద పండితుల సభలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సమాజం ఇతరులు చేయవలసిన పనులు సున్నితంగా చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. జ్ఞాన వైరాగ్యం కలిగిన సభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

Last Updated : May 13, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details