తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు మంగళవారం దిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రప్రయోజనాలపై.. ఏపీ ప్రభుత్వం గట్టిగా స్పందించాలని భాజపా రాష్ట్ర న్యాయకత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దీటుగా స్పందించాలని కోరింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నీటి విషయాలపై అవగాహన పెంచుకున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా నీటిపారుదలశాఖ మంత్రులుగా పని చేశారని గుర్తు చేసింది.
గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా...అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ నోరు మెదపలేదని విమర్శించింది. ప్రస్తుతం కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉన్నందున...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటిని తీసుకెళ్లే విషయంపై చర్చించాలని భాజపా...రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.
కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు