గుంటూరులోని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలను 100 పడకలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెల్లడించారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రేపల్లె వైద్యశాలకు రెండుసార్లు ఉత్తమ అవార్డులు రావటం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి, వైద్య సేవలు ఎలా ఉన్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. వరద బాధితులకు మందులు, వాటర్ బాటిల్స్ను రెడ్ క్రాస్ వారు పంపిణీ చేశారు.
"రేపల్లె ఆసుపత్రిని వంద పడకలు చేస్తాం" - medical camp
ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని రేపల్లె ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రేపల్లె ప్రభుత్వ వైద్య శాలను 100 పడకలుగా ఏర్పాటుచేస్తాం