ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు.. అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు - ap news updates

IPS Officers Transfers In AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 39 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.

IPS Transfers In AP
IPS Transfers In AP

By

Published : Apr 8, 2023, 6:21 AM IST

Updated : Apr 8, 2023, 7:18 AM IST

IPS Officers Transfers In AP: రాష్ట్రంలో బదిలీల పర్వం సాగుతోంది. నిన్న 54 మంది ఐఏఎస్​లను ట్రాన్స్​ఫర్​ చేసిన ప్రభుత్వం.. నేడు ఐపీఎస్​లను బదిలీ చేసింది. 39 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. సీఎస్ జవహర్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అదనపు డైరెక్టర్​గా పనిచేస్తున్న జీవీజీ అశోక్​కుమార్​ను ఏలూరు డీఐజీగా బదిలీ చేశారు. ఏలూరు డీఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజును గుంటూరు ఐజీ, దిశ ఐజీగా బదిలీ చేశారు. శాంతిభద్రతల ఏఐజీగా పనిచేస్తున్న ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని అనంతపురం డీఐజీగా పంపారు. అనంతపురం డీఐజీగా పనిచేస్తున్న ఎం.రవిప్రకాశ్‌ను సెబ్‌ డీఐజీగా స్థానచలనం కల్పించారు. దిశ డీఐజీ బి.రాజకుమారిని ఏపీఎస్పీ బెటాలియన్స్‌ డీఐజీగా నియమించారు.

ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ కమాండెంట్​గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్​ను గ్రే హౌండ్స్​ డీఐజీగా బదిలీ చేశారు. విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా విధులు నిర్వహిస్తున్న శంఖబత్ర బాగ్చీని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్​ అయ్యన్నార్​ను విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా బదిలీ చేశారు. ప్రొవిజన్స్​ అండ్​ లాజిస్టిక్స్​ అదనపు డీజీపీగా పనిచేస్తున్న అతుల్​సింగ్​ను పోలీసు నియామక మండలి ఛైర్మన్​, అదనపు డీజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

పోలీసు నియామక మండలి ఛైర్మన్​గా ఉన్న మనీష్​కుమార్ సిన్హా ప్రస్తుతం సెలవులపై వెళ్లగా.. ఆయన స్థానంలో అతుల్​సింగ్​ను బదిలీ చేశారు. విశాఖపట్నం కమిషనర్​గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్​ శ్రీకాంత్​ను సీఐడీ ఐజీగా బదిలీ చేశారు. గుంటూరు ఐజీగా పనిచేస్తున్న సీఎం త్రివిక్రమ వర్మను విశాఖపట్నం కమిషనర్​గా ట్రాన్స్​ఫర్​ చేశారు. విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్​ కమాండెంట్​గా ఉన్న విక్రాంత్​ పాటిల్​ను పార్వతీపురం మన్యం ఎస్పీగా బదిలీ చేశారు.​

పార్వతీపురం మన్యం ఎస్పీ వాసన్​ విద్యాసాగర్​ నాయుడును విశాఖపట్నం శాంతిభద్రతల డీసీపీగా బదిలీ చేశారు. విశాఖపట్నం శాంతిభద్రతలు డీసీపీగా ఉన్న గరుడ్​ సుమిత్​ సునీల్​ను ఎస్​బీఐ ఎస్పీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. పాడేరు అదనపు ఎస్పీగా ఉన్న తుహిన్​ సిన్హాను అల్లూరి సీతారామరాజు ఎస్పీగా బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు ఎస్పీగా ఉన్న ఎస్​. సతీష్​కుమార్​ను కాకినాడ ఎస్పీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అనకాపల్లి ఎస్పీగా ఉన్న గౌతమి శాలిను విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్​ కమాండెంట్​గా బదిలీ చేశారు. డా.అంబేడ్క్​ కోనసీమ ఎస్పీ సీహెచ్​ సుధీర్​కుమార్​ రెడ్డిని తూర్పుగోదావరి ఎస్పీగా పంపించారు. విజయవాడ శాంతిభద్రతలు, డీసీపీ డి.మేరి ప్రశాంతిని ఏలూరు ఎస్పీగా బదిలీ చేశారు. ఏలూరు ఎస్పీ రాహుల్​ దేవ్​ శర్మను విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్​ కమాండెంట్​గా స్థానచలనం కల్పించారు.

నెల్లూరు ఎస్పీగా ఉన్న సీహెచ్​ విజయరావును కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్​ కమాండెంట్గా బదిలీ చేశారు. ఏసీబీ ఎస్పీ ఆర్​.గంగాధర్​రావును అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్​రాజును సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్​ దేవ్​ సింగ్​ను విజయవాడ, రైల్వే ఎస్పీగా ట్రాన్స్​ఫర్​ చేశారు. కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను ఆక్టోపస్‌ ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

మరోవైపు పోస్టింగ్​ల కోసం నిరీక్షిస్తున్న ఆరుగురు ఐపీఎస్​లను కూడా ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్​.వి. మాధవ్​రెడ్డిని సత్యసాయి జిల్లా ఎస్పీగా, కె.శ్రీనివాసరావును అనంతపురం ఎస్పీగా, తిరుమలేశ్వర్​రెడ్డిని నెల్లూరు ఎస్పీగా, పి.శ్రీధర్​ను డా.అంబేడ్కర్​ కోనసీమ ఎస్పీగా,కె.వి.మురళీకృష్ణను అనకాపల్లి ఎస్పీగా, సర్వశేష్ఠ్ర త్రిపారిని పరిపాలన, పోలీసు ప్రధాన కార్యాలయం డీఐజీగా ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 8, 2023, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details